Q) క్రింది వానిలో ఈ పిల్లవాడిని శిక్షించుట సమర్ధనీయమైనది.
A) తరగతిలో ఎల్లప్పుడు అంతరాయం కలిగించే పిల్లవాడు
B) తరగతికి ఎప్పుడు ఆలస్యంగా వచ్చే పిల్లవాడు
C) తరగతి గది కృత్యాలలో భాగస్వామ్యం పంచుకొనని పిల్లవాడు
D) ఎన్నిసార్లు సరిచేసినా ఇతరుల వస్తువులను దొంగిలించే పిల్లవాడు
Q) ఒక ఉపాధ్యాయురాలు తన విద్యార్థిని ముందురోజు నేర్చుకున్న పద్యాన్ని అప్పచెప్పమన్నది. ఆ విద్యార్థి తన స్వంత పద్యాన్ని అప్పచెప్పింది. మీరు ఆ ఉపాధ్యాయురాలైన, మీరు చేయు మొదటి పని.
A) ఆజ్ఞ మీరినందుకు విద్యార్థిని దండించడం
B) పట్టించుకోకుండా నిశబ్ధంగా వుండడం
C) విద్యార్థికి మళ్ళీ ఇంకోసారి అలా చేయవద్దని చెప్పడం
D) విద్యార్థి ప్రతిభకు మెచ్చుకోవడం
Q) సమస్తరీయ గతిశీలత (Horizontal mobility) అంటే
A) ఒకే సామాజిక వర్గంలో జరిగే చలనం
B) సామాజిక క్రమానుగత శ్రేణిలో పైకి లేదా కిందికి జరిగే చలనం
C) భౌగోళిక గతిశీలత
D) సామాజిక వాతావరణంలో వ్యక్తి చెందే మార్పు
Q) కార్యక్రమాయుత అభ్యసనం యొక్క సూత్రం కానిది?
A) విషయాన్ని చిన్న చిన్న విభాగాలుగా అభ్యసించాలి
B) విద్యార్థి కార్యక్రమం పూర్తయిన తర్వాత ప్రశ్నలు అడగాలి
C) విద్యార్థి సమాధానంకు తగిన వేగంతో అభ్యసనం జరగాలి
D) విద్యార్థి సామర్ధ్యాలకు తగిన వేగంతో అభ్యసనం జరగాలి
Q) రేఖీయ కార్యక్రమం యొక్క ప్రయోజనం?
A) సృజనాత్మకత పెంపొందించవచ్చు
B) క్లిష్టమైన అంశాలను బోధించవచ్చు
C) కొత్త విషయాన్ని అత్యంత తేలికగా అభ్యసించవచ్చు
D) ఏక కాలంలో సమూహం ప్రయోజనం పొందుతుంది