
| ←TET Paper 1 | TET Mock Test→ |
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి.
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనే సామెత తెలుగు భాష ప్రాశస్త్యాన్ని, తెలుగు వారి గృహధర్మాన్ని వెల్లడిస్తోంది. ఆమెత అంటే విందు. విందు భౌతిక సుఖాన్నిస్తుంది. సామెత మానసికానందాన్ని కల్గిస్తుంది. శరీరానికి పుష్టి, మనస్సుకు తుష్టి ఉన్నప్పుడు మనిషి చేసే కార్యాలన్నీ ఫలిస్తాయి.
అనుభవానికి వ్యాప్తి ఉంది. గంధానికీ, గాలికీ, నీటికీ వ్యాప్తి ఉంది. వాటిని ఒక దగ్గరగా కూర్చితే సామెత అవుతుంది. అంటే అనుభవసారమే సామెత. ప్రాచీన భారతీయ వాఙ్మయమంతా సామెతల మయం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు సామెతల ద్వారా అందచందాల్ని సంతరించుకున్నాయి.
సంస్కృత సామ్య శబ్దం అసాధురూపం సామ్యత అని, సామ్యతే సామెతగా మారిందని అంటారు. సామెతకు సంస్కృతంలో లోకోక్తి, సూక్తి, సుభాషితం అనే పేర్లు ఉన్నాయి.
‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’ అనేది…?
A) సామెత
B) ఆమెత
C) ధర్మం
D) వాఙ్మయం
36) ‘ఆమెత’ అంటే ఏమిటి?
A) విందు
B) సామెత
C) అనుభవం
D) లోకోక్తి
37) మానసికానందాన్ని కల్గించేది ఏది?
A) గృహధర్మం
B) విందు
C) గంధం
D) సామెత
38) సామెత ఎలా పుడ్తుంది?
A) పని చేయడం వలన
B) మనస్సుకు ఆనందం కల్గినప్పుడు
C) జీవితానుభవసారం నుండి
D) సంస్కృతం ద్వారా
39) ‘తనర్చు’ అనే పదానికి అర్థం ఏమిటి?
A) తన యొక్క
B) ఆశ్చర్యపోవు
C) మళ్లించు
D) ప్రకాశించు
40) ‘జీమూతం, వారిదం’ అనే పర్యాయపదాలు కల్గిన పదం ఏది?
A) మేఘం
B) వారధి
C) వనధి
D) ధరణి