
| ←TET Paper 1 | TET Mock Test→ |
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
ఆది నుంచి తెలంగాణ ప్రజలను ముందుకు నడిపించడంలో, చైతన్యపరచడంలో సాహిత్యానిదే కీలకపాత్ర.సూటిగా మనసులను తాకేలా, ఆలోచింపజేసేలా ఎందరో ప్రముఖులు తమ రచనలు, కళారూపాల ద్వారా సమాజాన్ని జాగృతం చేయగలిగారు.అభ్యుదయ సాహిత్యానికి 1946 నుండి 1951 వరకు సాగిన తెలంగాణ సాయుధ పోరాటకాలం స్వర్ణయుగం.పోరాటం జరుగుతున్న కాలంలోనూ, ఆ తర్వాత కూడా పోరాట స్ఫూర్తితో రచనలు వెలువడ్డాయి.తెలంగాణ విమోచనోద్యమ రచయితలు కవిత్వం, పాట, నాటకం, నాటిక లాంటి సాహిత్య ప్రక్రియలను, బుర్రకథలు, ఒగ్గు కథలు, బుడబుక్కల కథ, హరికథ, వీధి భాగోతం, యక్షగానం లాంటి ప్రజాకళారూపాలను సుసంపన్నం చేశారు.
సుద్దాల హన్మంతు, తిరునగరి, దాశరథి, కాళోజీ, సోమసుందర్ తదితరులు ఎన్నో పోరాట గీతాలను రాశారు.తెలంగాణ సాయుధపోరాట కాలంలో నాయకుల ఉపన్యాసాలు, పత్రికల వార్తల కంటే ఎక్కువ ప్రభావం చూపినవి ప్రజాకళారూపాలు.
ఏ కాలాన్ని అభ్యుదయ సాహిత్యానికి స్వర్ణయుగంగా భావిస్తారు?
A) తెలంగాణ సాయుధపోరాట కాలం
B) ప్రాచీన సాహిత్య కాలం
C) తెలంగాణ అవతరణదినోత్సవ సమయం
D) తెలంగాణ భావోత్సవాల సమయం
36) తెలంగాణ ప్రజలను చైతన్యపరిచి, ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించినవి ఏవి?
A) పత్రికలు
B) ప్రముఖుల ఉపన్యాసాలు
C) సాహిత్యం
D) సినిమాలు
37) ప్రజాకళారూపాలని వేటిని అంటారు?
A) పద్యం, నాటిక, పాట, కవితలు మొదలుగునవి
B) పత్రికలు, సినిమాలు, ప్రసంగాలు మొదలుగునవి
C) రాజకీయ నాయకుల ఉపన్యాసాలు, ఆటల పోటీలు, క్రీడోత్సవాలు మొదలుగునవి
D) బుర్రకథ, ఒగ్గుకథ, వీథిభాగోతం, యక్షగానం మొదలుగునవి
38) తెలంగాణ సాయుధపోరాటకాలంలో ఎక్కువ ప్రభావం చూపినవి ఏవి?
A) ప్రజా కళారూపాలు
B) సాహిత్య ప్రక్రియలు
C) ప్రముఖుల ప్రసంగాలు
D) ప్రసార మాధ్యమాలు
39) ‘నాగార్జున సాగర్ అందమైన ప్రదేశం’ – ఈ వాక్యము ఏ రకమైన వాక్యము?
A) ఆశ్చర్యార్థక వాక్యము
B) సంక్లిష్ట వాక్యము
C) క్రియారహిత వాక్యము
D) క్రియా సహిత వాక్యము
40) కింది పదాలలో నపుంసక ఏక వచన శబ్దము ఏది?
A) చెట్లు
B) సుమతి
C) రాజు
D) పుట్ట