
| ←TET Paper 1 | TET Mock Test→ |
46) “మనకు సలిలం అవసరం కాబట్టి ఆ ఉదకాన్ని ఎప్పటికప్పుడు స్వీకరిస్తేనే ఆ జలం మనను కాపాడుతుంది”.
ఈ వాక్యంలో సమానార్థక పదాలేవేవి?
A) స్వీకరిస్తే, అవసరం, సలిలం
B) కాపాడు, ఉదకం, స్వీకరణ
C) సలిలం, జలం, ఉదకం
D) జలం, స్వీకరిస్తే, కాపాడు
47) “కార్యం, స్తంభం, నిద్దుర, పక్కి” – వీటిలో వికృతి పదాలేవి?
A) కార్యం, పక్కి
B) స్తంభం నిద్దుర
C) కార్యం, నిద్దుర
D) నిద్దుర పక్కి
48) కింది వాటిలో జాతీయం కానిది ఏది?
A) అత్తసొమ్మును అల్లుడు దానం చేసినట్లు
B) చెవినిల్లుగట్టుకొని
C) గుండె చెరువైంది
D) కాలికి బుద్ధిచెప్పు
49) ‘వినాయకచవితి’ పండుగను ఎప్పుడు జరుపుకుంటారు?
A) భాద్రపద శుక్లపక్ష చతుర్థినాడు
B) భాద్రపద బహుళ చవితినాడు
C) భాద్రపద శుక్ల చతుర్దశినాడు
D) భాద్రపద బహుళ చతుర్దశినాడు
50) తొక్కుడు బండతో సాహితీ క్షేత్రలో అడుగిడినది ఎవరు?
A) ఆచ్చి వేంకటాచార్యులు
B) టి.కృష్ణమూర్తి యాదవ్
C) దేవులపల్లి రామానుజరావ్
D) చెరబండ రాజు