TS TET Language 1 Telugu Methodology 9 Jan 2025 Shift 1 Solved Paper

TS TET Paper 1 Language 1 Telugu Methodology Previous Papers with Answers – 9th Jan 2025 Shift 1

The TS TET Paper 1 Language 1 Telugu Methodology exam held on 9 January 2025 – Shift 1 is very important for candidates preparing for upcoming Telangana State Teacher Eligibility Test (TS TET) exams. TS TET Paper 1 Language 1 Telugu Methodology is a scoring and concept-based section, and practicing previous question papers with answers greatly improves accuracy and confidence.

In this post, you can download the TS TET Paper 1 Language 1 Telugu Methodology question paper 9 Jan 2025 Shift 1 with answers and use it as a mock test or revision material.

←TET Paper 1 TET Mock Test→


TS TET
PAPER 1
9th January 2025 Shift 1
Previous Papers
Language 1 Telugu Methodology

55) విమర్శను సహృదయంతో స్వీకరించడం – అనే స్పష్టీకరణ మాతృభాష బోధనలో దీనికి చెందినది

A) రసానుభూతి
B) సముచిత మనోవైఖరులు
C) భాషాభిరుచి
D) సృజనాత్మక శక్తి

View Answer
B) సముచిత మనోవైఖరులు

56) ఛామ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తివాద సిద్ధాంతం

A) పూ పూ వాదం
B) డింగ్ డాంగ్ వాదం
C) స్వతస్సిద్ధ వాదం
D) ధాతు వాదం

View Answer
C) స్వతస్సిద్ధ వాదం

57) ఉక్తలేఖన సందర్భంగా, ఉపాధ్యాయుడు తీసుకోవలసిన జాగ్రత్త

A) విరామ చిహ్నాలను చెప్పకూడదు.తన ఉచ్ఛారణను బట్టి, భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి.
B) విద్యార్థులు రాసిన అంశాలను ఉపాధ్యాయుడు సవరించరాదు.
C) ఉపాధ్యాయుడు, ఎక్కువ వేగంగా రాయగల విద్యార్థి వేగంతో సమానమైన వేగంతో చెప్పాలి.
D) ఒకవేళ ఏ విద్యార్థి అయినా రాయడంలో వెనుకబడితే, వారిని పట్టించుకోకూడదు.

View Answer
A) విరామ చిహ్నాలను చెప్పకూడదు.తన ఉచ్ఛారణను బట్టి, భావాన్ని బట్టి విద్యార్థులే వాటిని గ్రహించేటట్లు చూడాలి.

58) వ్యాకరణ బోధన పద్ధతుల్లో, అనుమానోపపత్తి పద్ధతి అనగా

A) ఉపాధ్యాయుడు మొదట వ్యాకరణ సూత్రాన్ని చెప్పి, అందులోని పారిభాషిక పదాలను వివరించి, పిదప ఉదాహరణలు చెప్పి సూత్రంతో సమన్వయం చేసే పద్ధతి.
B) గద్య, పద్య పాఠ్యాంశాలను బోధించే సందర్భంలో వచ్చే పదాలను, ప్రాసంగికంగా బోధించే పద్ధతి
C) విద్యార్థులు ఆర్జించిన వ్యాకరణ సంప్రదాయ జ్ఞానాన్ని వాచకాలలోని ప్రయోగాలతో అనుసంధానం చేయడం ద్వారా వ్యాకరణ నియమాలను నేర్చుకొనే పద్ధతి
D) తాను ఇచ్చిన ఉదాహరణల స్వరూప స్వభావాలను విద్యార్థులచే పరిశీలింపజేసి, వాని ఆధారంగా వారే స్వయంగా సూత్రాలను నిర్మించేలా బోధించు పద్ధతి.

View Answer
D) తాను ఇచ్చిన ఉదాహరణల స్వరూప స్వభావాలను విద్యార్థులచే పరిశీలింపజేసి, వాని ఆధారంగా వారే స్వయంగా సూత్రాలను నిర్మించేలా బోధించు పద్ధతి.

59) వివిధ వ్యక్తులు, సంస్థల నుండి గ్రంథాలను సేకరించి, వాటిని ముఖ్యంగా పేదవర్గాల పాఠకులకు అందుబాటులో ఉండేలా భద్రపరచే స్థలం

A) భాషా ప్రయోగశాల
B) పుస్తక నిధి
C) సారస్వత సంఘం
D) పుస్తక విక్రయశాల

View Answer
B) పుస్తక నిధి

60) ఇవ్వబడిన సమాధానాలలో 3 సరియైనవి కాగా, 1 సరికాని సమాధానాన్ని విద్యార్థి గుర్తించేలా ఇవ్వబడే ప్రశ్న రకం

A) తప్పు – ఒప్పు ప్రశ్న
B) సహసంబంధ ప్రశ్న
C) విలోమ రూప ప్రశ్న
D) జతపరచు ప్రశ్న

View Answer
C) విలోమ రూప ప్రశ్న

←TET Paper 1 TET Mock Test→
Spread the love

Leave a Comment

About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!