
| ←TET Paper 2 | TET Mock Test→ |
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
జానపద విజ్ఞానం – వచనశాఖలో సామెతలు, పొడుపు కథలు ప్రధానమైనవి. రమ్యమైన పోలికలతో జీవితాన్ని ఆవిష్కరించడం, సామెతలను ఉపయోగిస్తూ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయడం, పొడుపు కథలతో కాలక్షేపం, మేధోమథనం చేయడం వంటివి జానపదుల జీవితాల్లో ముఖ్యమైనవి. ఇవి మానవ సంబంధాలకు సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి.
అనంతమైన జీవన సారాన్ని అల్పాక్షరాలు నింపి సందర్భాన్ని సందేశమయం చేసేది సామెత. జనులకు ఉపదేశాన్ని, లోకగతిని అందిస్తుంది సామెత. సునిశితమైన హాస్యాన్ని తోడుగా చేసుకొని వ్యంగ్యంగా లోకానుభవాన్ని పంచుతుంది. అందుకే ‘సామెతలేని మాట ఆమెతలేని ఇల్లు వంటిది’ అన్నారు పెద్దలు. సామెత అనేది సామ్యత అనే పదం నుండి ఏర్పడింది. సామ్యత అంటే పోలిక అని అర్థం. సామెతను ఆంగ్లంలో proverb అంటారు. హిందీలో కహావత్, కన్నడంలో గాదె, తమిళంలో పళమొళి, మలయాళంలో పళించోల్ అని అంటారు. తెలుగులో సామెతకు నానుడి, లోకోక్తి, శాస్త్రం, జనశ్రుతి అన్న అర్థాలున్నాయి. సామెత అనే పదాన్ని 15వ శతాబ్దంలో వరాహ పురాణంలో తొలిసారిగా ప్రయోగించారు. సామెతకు నాలుగు లక్షణాలున్నాయి. అవి సరళత, సరసత, సహజత, సంక్షిప్తిత.
జానపద విజ్ఞానం – వచన శాఖలో ముఖ్యమైనవి ఏవి?
A) సామెతలు, జాతీయాలు
B) సామెతలు, పొడుపుకథలు
C) పొడుపుకథలు, జాతీయాలు
D) సామెతలు, సమాసాలు
36) సామెత ఏం చేస్తుంది?
A) అల్పమైన జీవనసారాన్ని అందిస్తుంది
B) ఆనంద జీవనసారాన్ని అందిస్తుంది
C) ఆహ్లాదమైన జీవసారాన్ని అందిస్తుంది
D) అనంతమైన జీవనసారాన్ని అందిస్తుంది
37) సామెత పదాన్ని తొలిసారిగా ఏ గ్రంథంలో ప్రయోగించారు?
A) వామన పురాణం
B) వరాహ పురాణం
C) జనశ్రుతి పురాణం
D) వారాహీ పురాణం
38) సామెతకు మూలమైన పదం ఏమిటి?
A) సమత
B) సామత
C) సామ్యత
D) సామేత
39) ‘పాదపద్మములు’ ఏ సమాసం?
A) ఉపమానోత్తరపద కర్మధారయ సమాసము
B) ద్వంద్వ సమాసము
C) రూపక సమాసము
D) ఉపమానోభయ పదకర్మధారయ సమాసము
40) ‘పడిలేచి’ అనేది ఏ క్రియ?
A) సమాపక క్రియ
B) అసమాపక క్రియ
C) సకర్మక క్రియ
D) అకర్మక క్రియ