
| ←TET Paper 2 | TET Mock Test→ |
35) ఈ కింది గద్య భాగాన్ని చదివి ప్రశ్నకు సరైన సమాధానాలను గుర్తించండి.
రంగనాథ రామాయణ కర్త గోనబుద్ధారెడ్డి కాకతీయ ప్రతాపరుద్ర ప్రభువుకు సమకాలికునిగా, కాకతీయులకు విధేయుడైన సామంతరాజుగా మహబూబ్ నగర్ జిల్లా వర్ధమాన పురమును (దీనినే వడ్డెమాను అందురు) పరిపాలన చేశాడు. కాకతీయులతో బంధుత్వం కూడా కలిగి ఉన్నాడు. గోనబుద్ధారెడ్డి పేరు మీద బుద్ధవరం (బుద్ధారం) అనే గ్రామం ఉంది. బూదపురం అనే (భూత్పూర్) గ్రామంలో శాసనాలూ లభించాయి. గోనవంశీయుల చరిత్రను తెలిపే శాసనాలు దాదాపు పదకొండు లభ్యమైనాయి. వీటి ఆధారంగానే వీరి కాలాన్ని, చరిత్రను పరిశోధకులు అంచనా వేస్తున్నారు. రంగనాథ రామాయణాన్ని మొదటగా పరిష్కరణ చేయించింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తర్వాత వావిళ్ళవారు నాగపూడి కుప్పు స్వామయ్య పీఠికతో (1910లో) ముద్రించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు పింగళి లక్ష్మీకాంతం మరియు కట్టమంచి వారి పలుకులతో ముద్రణ చేశారు. రాయలు అండ్ కో వారు జనమంచి వేంకట సుబ్రమణ్య శర్మ పీఠికతో, మరొకసారి మల్లంపల్లి సోమశేఖర శర్మ పీఠికతో ముద్రించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్వరామాయణాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదకత్వంలో ముద్రింపజేశారు.
గోనబుద్దారెడ్డి కృతి పేరేమిటి?
A) జనప్రియ రామాయణం
B) రామాయణ కల్పవృక్షం
C) రామాయణసారం
D) రంగనాథ రామాయణం
36) ‘బుద్ధవరం’ గ్రామం ఎవరి పేరు మీద నిర్మించబడింది?
A) ప్రతాపరుద్రుడు
B) గోనబుద్ధారెడ్డి
C) గణపతిదేవుడు
D) బుద్ధుడు
37) రంగనాథ రామాయణాన్ని మొదటగా పరిష్కరణ చేయించినదెవరు?
A) బ్రౌన్
B) వావిళ్ళ
C) సుబ్రహ్మణ్యశాస్త్రి
D) రంగనాథుడు
38) నాగపూడి కుప్పుస్వామయ్య పీఠికతో రంగనాథ రామాయణాన్ని ముద్రించినది ఎవరు?
A) వేటూరి ప్రభాకరశాస్త్రి
B) పింగళి లక్ష్మీకాంతం
C) వావిళ్ళవారు
D) మల్లంపల్లి సోమశేఖర శర్మ