![]()
TS TET Paper 2 Language 1 Telugu – Previous Year Questions & Answers (2 Jan 2025 Shift 1)
This post provides the official TS TET Paper 2 Language 1 Telugu question paper with answers for the Social Science exam conducted on 2nd January 2025 (Shift 1). The questions are taken from the official TET question paper and follow the latest TS TET syllabus and exam pattern. The Telugu section includes questions on comprehension, grammar, vocabulary, and language pedagogy relevant to Classes VI to VIII. Practising these TS TET Paper 2 Telugu previous year questions and answers helps candidates understand the exact exam standard and prepare confidently for upcoming TET examinations.
| ←TET Paper 2 | TET Mock Test→ |
TS TET PAPER 2
Social Science
(2 Jan 2025 Shift 1)
Previous Papers
Language 1 Telugu
ప్రాయము జారి వార్ధకము పైకొనె కృంగిన జీవితంబునన్
తీయదనంబు తగ్గినది, నిగ్గులు పాసిన జీర్ణపర్ణమై
కాయము వాడు సూపినది గాలికి తూగెడి తీగనైతి నే
మోయగజాల రాజ్యభరమున్ బలహీనత మోకరిల్లుటన్
ప్రాయము జారి వచ్చినదేమిటి?
కృంగిన జీవితంలో ఏమి తగ్గింది?
నిగ్గులు తగ్గి జీర్ణమైనదేమిటి?
ఈ పద్యంలో దేని గురించి ఉన్నది?
రంగనాథ రామాయణ కర్త గోనబుద్ధారెడ్డి కాకతీయ ప్రతాపరుద్ర ప్రభువుకు సమకాలికునిగా, కాకతీయులకు విధేయుడైన సామంతరాజుగా మహబూబ్ నగర్ జిల్లా వర్ధమాన పురమును (దీనినే వడ్డెమాను అందురు) పరిపాలన చేశాడు. కాకతీయులతో బంధుత్వం కూడా కలిగి ఉన్నాడు. గోనబుద్ధారెడ్డి పేరు మీద బుద్ధవరం (బుద్ధారం) అనే గ్రామం ఉంది. బూదపురం అనే (భూత్పూర్) గ్రామంలో శాసనాలూ లభించాయి. గోనవంశీయుల చరిత్రను తెలిపే శాసనాలు దాదాపు పదకొండు లభ్యమైనాయి. వీటి ఆధారంగానే వీరి కాలాన్ని, చరిత్రను పరిశోధకులు అంచనా వేస్తున్నారు. రంగనాథ రామాయణాన్ని మొదటగా పరిష్కరణ చేయించింది చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తర్వాత వావిళ్ళవారు నాగపూడి కుప్పు స్వామయ్య పీఠికతో (1910లో) ముద్రించారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం వారు పింగళి లక్ష్మీకాంతం మరియు కట్టమంచి వారి పలుకులతో ముద్రణ చేశారు. రాయలు అండ్ కో వారు జనమంచి వేంకట సుబ్రమణ్య శర్మ పీఠికతో, మరొకసారి మల్లంపల్లి సోమశేఖర శర్మ పీఠికతో ముద్రించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పూర్వరామాయణాన్ని వేటూరి ప్రభాకరశాస్త్రి సంపాదకత్వంలో ముద్రింపజేశారు.
గోనబుద్దారెడ్డి కృతి పేరేమిటి?
‘బుద్ధవరం’ గ్రామం ఎవరి పేరు మీద నిర్మించబడింది?
రంగనాథ రామాయణాన్ని మొదటగా పరిష్కరణ చేయించినదెవరు?
నాగపూడి కుప్పుస్వామయ్య పీఠికతో రంగనాథ రామాయణాన్ని ముద్రించినది ఎవరు?
| ←TET Paper 2 | TET Mock Test→ |