
| ←TET Paper 2 | TET Mock Test→ |
39) ‘అచ్చోటు’ పదాన్ని విడదీయగా…?
A) అ + చోటు
B) ఆ + చోటు
C) అ + చ్చోటు
D) ఆ + చ్చోటు
40) “నీటిలో తేలు తేలుతుందా?’ ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి?
A) రూపకాలంకారం
B) యమకాలంకారం
C) ఉత్ప్రేక్షాలంకారం
D) ఛేకానుప్రాసాలంకారం
41) ‘వృద్ధి సంధి’కి ఉదాహరణ ఏది?
A) ఏకైక
B) పేదరాలు
C) మేనత్త
D) పిత్రార్జితం
42) “సత్యదూరము” ఇది ఏ సమాసం?
A) ద్వితీయా తత్పురుష సమాసం
B) తృతీయా తత్పురుష సమాసం
C) షష్ఠీ తత్పురుష సమాసం
D) పంచమీ తత్పురుష సమాసం
43) ‘చెవికిం గుండల మొప్పుగాదు శ్రుతమే చేదమ్మికిన్గంకణం’. ఈ పద్యపాదములోని గణాలు ఏవి?
A) స, భ, ర, ణ, మ, య, వ
B) మ, స, జ, స, త, త, గ
C) న, జ, భ, జ, జ, జ, ర
D) భ, ర, న, భ, భ, ర, వ
44) ‘అవని’ పదానికి అర్థం ఏమిటి?
A) నీరు
B) గాలి
C) భూమి
D) ఆకాశం
45) ‘రాజు’ పదానికి నానార్థాలు ఏవి?
A) సూర్యుడు, మిత్రుడు
B) చంద్రుడు, ప్రభువు
C) అగ్ని ,ఇంద్రుడు
D) మేఘుడు, ప్రియుడు