TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

36) జాతీయాదాయ విశ్లేషణలో భాగంగా, వైయక్తిక ఆదాయంలో ఇమిడి ఉండే అంశాలు కింది వాటిలో ఏవి ?
ఎ. ప్రత్యక్ష పన్నులు
బి. పరోక్ష పన్నులు
సి. తరుగుదల
డి. బదిలీ చెల్లింపులు
ఇ. ఎగుమతులు,దిగుమతులు
ఎఫ్. మధ్యంతర వస్తువులు
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ మరియు డి మాత్రమే
B) ఎ, సి, ఇ మరియు ఎఫ్ మాత్రమే
C) ఎ, బి మరియు సి మాత్రమే
D) బి, డి మరియు ఇ మాత్రమే

View Answer
A) ఎ మరియు డి మాత్రమే

37) కింద పేర్కొనబడిన సాగునీటి పథకాలలో ఏవి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ?
ఎ. చనాకా-కొరాటా ప్రాజెక్టు (నిర్మాణంలో ఉన్నది)
బి. మత్తడి వాగు ప్రాజెక్టు
సి. నీల్వాయి ప్రాజెక్టు
డి. సదరమత్ ప్రాజెక్టు
ఇ. సాత్నాలా ప్రాజెక్టు
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) సి, డి మరియు ఇ మాత్రమే
B) ఎ, బి మరియు సి మాత్రమే
C) ఎ, బి, డి మరియు ఇ మాత్రమే
D) ఎ, బి మరియు ఇ మాత్రమే

View Answer
D) ఎ, బి మరియు ఇ మాత్రమే

38) కింది వాటిని జతపరచండి :

జాబితా-1 జాబితా-2
ఎ. క్రయోజనిక్స్ 1. శిలాజాల అధ్యయనం
బి. సైటోలజీ 2. అతిశీతల ఉష్ణోగ్రతల అధ్యయనం
సి. నెఫ్రాలజీ 3. కణాల అధ్యయనం
డి. పురాజీవ శాస్త్రం 4. మూత్రపిండాల అధ్యయనం
5. నాడీ వ్యవస్థ అధ్యయనం

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-3, బి-2, సి-4, డి-5
B) ఎ-3, బి-4, సి-5, డి-1
C) ఎ-2, బి-3, సి-4, డి-1
D) ఎ-4, బి-3, సి-5, డి-2

View Answer
C) ఎ-2, బి-3, సి-4, డి-1

39) కింది వాటిని జతపరచండి :

జాబితా-1 జాబితా-2
ఎ. కేసరి 1. గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు
బి. వివేకవర్ధిని 2. శిశిర కుమార్ ఘోష్
సి. స్వరాజ్య పత్రిక 3. తిలక్
డి. అమృత్ బజార్ పత్రిక 4. కందుకూరి వీరేశలింగం

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-3, బి-4, సి-1, డి-2
B) ఎ-2, బి-1, సి-3, డి-4
C) ఎ-4, బి-2, సి-1, డి-3
D) ఎ-1, బి-3, సి-2, డి-4

View Answer
A) ఎ-3, బి-4, సి-1, డి-2

40) సీనియారిటీ ప్రాతిపదికన కింది వారిలో ఎవరు మొదటి రాజ్యాంగ అసెంబ్లీ మీటింగ్ కు అధ్యక్షత వహించారు ?

A) వల్లభ్ భాయ్ పటేల్
B) సచ్చిదానంద సిన్హా
C) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్
D) రాజేంద్ర ప్రసాద్

View Answer
B) సచ్చిదానంద సిన్హా

Spread the love

Leave a Comment

Solve : *
28 × 30 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!