
56) భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులకు సంబంధించి వీటిలో ఏవి సరైనవి?
(ఎ) ప్రాథమిక విధులను రిట్ జురిస్టిక్షన్ ద్వారా అమలు చేయవచ్చును
(బి) ప్రాథమిక విధులు రాజ్యాంగం ఏర్పాటు మొదలు నుండి రాజ్యాంగములో భాగం
(సి) స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల ద్వారా ప్రాథమిక విధులు రాజ్యాంగంలో భాగమైనాయి
(డి) ప్రాథమిక విధులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి
సరైన జవాబును ఎంచుకొనుము.
57) ప్రాథమిక హక్కులకు సంబంధించిన వీటిని పరిశీలించుము.
(ఎ) నేర అభియోగాలకు సంబంధించిన రక్షణ పౌరులకు, పౌరులు కాని వారందరికీ ఇవ్వడమైనది.
(బి) ప్రభుత్వ ఉద్యోగ విషయంలో సమాన అవకాశాలు పౌరులకు, పౌరులు కాని వారందరికీ ఇవ్వడమైనది.
(సి) వాక్ స్వాతంత్య్రం, సమావేశం సంస్థల ఏర్పాటు హక్కులు పౌరులకు, పౌరులు కాని వారందరికీ ఇవ్వడమైనది.
(డి) ఏ మతమునైనను విశ్వసించుటకు, అచరించుటకు, ప్రచారం చేయుటకు హక్కులు పౌరులకు, పౌరులు కాని వారందరికీ ఇవ్వడమైనది.
సరైన వ్యాఖ్య(లు) గల ఐచ్చికాన్ని ఎంచుకొనుము:
58) జాతీయ సమగ్రతకు సంబంధించిన కింది అంశాలను పరిశీలించండి:
(ఎ) ‘మనం భారతదేశ ప్రజలందరం’ తో భారత రాజ్యాంగ ప్రవేశిక (ప్రియాంబుల్) మొదలవుతుంది.
(బి) భారత రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలు అందరికీ సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ కల్పించే దిశగా చర్యలను తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశిస్తాయి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:
59) ప్రాథమిక విధులకు సంబంధించి కింది అంశాలను పరిశీలించి
(ఎ) ఆర్టికల్ 51 ప్రాథమిక విధులను తెలుపుతుంది.
(బి) 1976 సం॥పు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను పొందుపరచారు.
(సి) ‘రిట్స్’ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేం.
(డి) రాజ్యాంగ పద్ధతులలో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేం
సరియైన జవాబును ఎంపిక చేయండి.
60) కింది అంశాలను పరిగణించండి?
(ఎ) భారత రాజ్యాంగంలో మూడు రకాల అత్యవసర పరిస్థితులు పేర్కొన బడ్డాయి.
(బి) ప్రాధమిక హక్కుల అమలుకై సుప్రీంకోర్టు రిట్స్ (ఆదేశాలు)ను జారీ చేస్తుంది.
కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి?