Latex Code Testing 

61) కింది ప్రవచనాలను చదువుము.
(ఎ) అఖిల భారత సర్వీసులు నిబంధనలు భారత రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు.
(బి) జాతీయాభివృద్ధి మండలి ప్రస్తావన భారత రాజ్యాం గంలో లేదు.
(సి) స్టాంపు డ్యూటీని కేంద్రం విధిస్తుంది. రాష్ట్రాలు వాటిని వసూలు చేసుకొని వినియోగించుకోవచ్చు
సరైన జవాబు :

A) (ఎ) మరియు (సి) నిజం కానీ (బి) తప్పు

B) (ఎ), (బి) మరియు (సి) లు నిజం

C) (ఎ) మరియు (సి)లు తప్పు కాని (బి) ఒప్పు

D) (ఎ) మరియు (బి)లు ఒప్పుకాని (సి) తప్పు

View Answer
B) (ఎ), (బి) మరియు (సి) లు నిజం

62) పితృస్వామ్య సమాజానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది?

A) పురుష ఆధిపత్య సమాజం

B) వ్యవసాయ సమాజం

C) చిన్న కుటుంబం (న్యూక్లియర్ సమాజం)

D) మహిళా ఆధిపత్య సమాజం

View Answer
A) పురుష ఆధిపత్య సమాజం

63) ఏ ఆదేశిక సూత్రం ఇంతవరకు ఆచరణకు సాధ్యం కాకుండా విఫలమైంది?

A) ఉచిత న్యాయ సహాయం

B) ఉమ్మడి సివిల్ కోడ్ (పౌర స్మృతి)

C) గ్రామ పంచాయతీల ఏర్పాటు

D) అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించడం

View Answer
B) ఉమ్మడి సివిల్ కోడ్ (పౌర స్మృతి)

64) భారత పౌరుల యొక్క ప్రాథమిక విధులు

A) ఒక సుప్రీంకోర్టు తీర్పు ద్వారా చేర్చారు.

B) స్వతహాగా రాజ్యాంగంలో ఉన్నాయి

C) 46వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

D) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

View Answer
D) 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

65) కింది వాటిలో వేటికి భారతదేశ రాజ్యాంగం హామి ఇస్తుంది?
(ఎ) దేశంలో ఏ ప్రాంతంలో అయినా స్వేచ్ఛగా సంచరించే స్వేచ్ఛ
(బి) ఆయుధ రహితంగా శాంతియుత సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛన
(సి) భారతదేశంలో ఏ ప్రాంతంలో అయిన ఆస్తులను కలిగి ఉండే, సంపాదించే మరియు అమ్ముకునే స్వేచ్ఛ
(డి) ఏ వ్యాపారం లేదా వృత్తి అయినా చేపట్టే స్వేచ్ఛ
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ, సి & డి మాత్రమే

B) ఎ, బి & సి మాత్రమే

C) బి & డి మాత్రమే

D) ఎ, బి, సి & డి మాత్రమే

View Answer
D) ఎ, బి, సి & డి మాత్రమే
Your Score: 0 / 0
Spread the love
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!