10th Class biology Chapter wise Important bit bank in Telugu medium

ప్రత్యుత్పత్తి

1. ఏకకణ జీవులు (బాక్టీరియా, అమీబా, పేరమీషియం ) _________ ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.

View Answer
ద్విధావిచ్ఛిత్తి

2. ఈస్ట్ లలో ________ ద్వారా, స్పైరోగైరా, లైకెన్ లలో ముక్కలగుట ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును.

View Answer
కోరకీభవనం

3. ____________ ఉత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంగా మారే చర్య.

View Answer
అనిషేక (విత్తన రహిత) ఫలాల

4. రణపాల (బ్రయోఫిల్ల )మొక్కలో _________ ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తి జరుగును.

View Answer
పత్ర కోరకాల

5. ఉల్లి నందు ________ , బంగాళదుంపలో _________ (దుంప) శాఖీయ వ్యాప్తికి ఉపయోగపడును.

View Answer
లశునాలు, కన్నులు

6. అంటుకట్టుటలో నేలపై పెరుగుతున్న మొక్కను ______ అని, వేరుచేయబడిన భాగాన్ని _______ అని అంటారు.

View Answer
స్టాక్, సయాన్

7. తక్కువ కాలవ్యవధిలో ఎక్కువ మొక్కలు పెంచడం ___________ ద్వారా సాధ్యమగును.

View Answer
కణజాల వర్ధనం

8. శిలీంద్రా లలో (రైజోపస్, మ్యూకార్ _______ ద్వారా ప్రత్యుత్పత్తి జరుగును.

View Answer
సిద్ధబీజాల

9. ఫెర్న్ మొక్కలో “సోరై”లుండే పత్రా ___________ (స్పోరోఫిల్) అంటారు.

View Answer
సిద్ధుభీజాశయ పత్రాలు

10. చేపలు, ఉభయచరాలలో __________ జరుగును.

View Answer
బాహ్య ఫలదీకరణం

11. శుక్రనాళికలు ___________ (శుక్రకణాల తాత్కాలిక నిల్వ కేంద్రం)ను ఏర్పరుస్తాయి.

View Answer
ఎపిడిడిమిస్

12. పౌరుష, కౌపర్ గ్రంధుల స్రావాన్ని _________ అంటారు.

View Answer
శుక్రం

13. పురుష ప్రత్యుత్పత్తి అవయవాల అభివృద్ధిని _________ నియంత్రిస్తుంది.

View Answer
టెస్టోస్టిరాన్

14. గ్రాఫియన్ పుటిక పగిలి అండం విడుదలగుటను __________ అంటారు.

View Answer
అండత్సోర్గం

15. పిండానికి తేమను, అఘాతాలనుండి రక్షణను ఇచ్చేది _________ .

View Answer
ఉల్బకద్రవం

16. పిండాన్ని జరాయువుతో కలిపే ________ ద్వారా బిడ్డకు పో షకపదార్థాల సరఫరా జరుగును.

View Answer
నాభిరజ్జువు

17. 3నెలల నుండి పిండాన్ని _______ అంటారు.

View Answer
భ్రూణం

18. గుర్రం యొక్క గర్భావధి కాలం ______ రోజులు. ఎలుకలలో ______ రోజులు.

View Answer
330, 20-22

19. జననాంతరం స్థనగ్రంధుల నుండి విడుదలయ్యే స్రావాన్ని __________ అంటారు.

View Answer
ప్రథమ స్తన్యం

20. సొరకాయ బొప్పాయి ________ పుష్పాలకు ఉదాహరణలు.

View Answer
ఏకలింగ

21. పరాగనాళంలో ఉండే కేంద్రకాల సంఖ్య ________ .

View Answer
రెండు

22. ద్వితీయ కేంద్రకంతో పురుషబీజకణం సంయోగం (ద్వితీయ ఫలదీకరణం) చెంది ___________ ఏర్పరుస్తుంది.

View Answer
అంకురచ్ఛదంను

23. కణాలు అంతకుముందున్న కణాలనుండి ఏర్పడుతాయని ________ ప్రతిపాదించాడు.

View Answer
విర్చోప్

24. 1879లో వాల్టర్ ప్లె మింద్ _________ కనుగొన్నాడు.

View Answer
సమవిభజనను

25._________ క్రోమోజోమ్ లపై జన్యువులను గుర్తించాడు.

View Answer
విల్హేల్మ్ రౌక్స్

26. కణవిభజన జరిగినా క్రోమోజోమ్ ల సంఖ్య స్థిరంగా ఉంటుందని _________ గుర్తించాడు.

View Answer
ఆగస్ట్ వీస్ మన్

27. _________ క్షయకరణ విభజనను గుర్తించాడు.

View Answer
థియోడర్ బావెరి

28. 1953లో డీ ఆక్సీరిబో న్యూక్లియిక్ ఆసిడ్ (DNA) నిర్మాణాన్ని ______ మరియు _____ కనుగొనారు.

View Answer
వాట్సన్, క్రిక్

29. DNA సంశ్లేషణ జరిగేదశ _____ దశ.

View Answer
S

30. కణవిభజనను ________ అని, కేంద్రక విభజనను __________ అని అంటారు.

View Answer
సైటోకైనసిస్, కేరియోకైనసిస్

31. క్షయకరణ విభజన వలన ___________ ( సగం క్రోమోజోమ్ సంఖ్య) కణాలు ఏర్పడుతాయి

View Answer
4 ఏకస్థితిక

32. AIDS పదాన్ని విస్తరించగా ____________

View Answer
Acquired Immuno Deficiency Syndrome.

33. ASHA అనగా ________________

View Answer
Accredited Social Health Activist.

34. ART అనగా _____________.

View Answer
Anti Retroviral Therapy

35. కాపర్ – T, లూప్ మొదలైనవి స్త్రీలలో _______________ (contraceptive).

View Answer
గర్భనిరోధక సాధనాలు

36. శుక్రకణాలను నాశనం చేసే మాత్రలను _________ (శుక్రకణ నాశినులు ) అంటారు.

View Answer
స్పెర్మిసైడ్స్

37. పురుషలలో శుక్రనాళం కత్తిరించి చేసే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సను ________ అంటారు.

View Answer
వేసెక్టమీ

38. స్త్రీలలో అండనాళం (ఫాలోఫియన్ ట్యూబ్) కత్తిరించి చేసే కుటుంబనియంత్రణ శస్త్రచికిత్సను __________ అంటారు.

View Answer
ట్యూబెక్టమీ
Spread the love

1 thought on “10th Class biology Chapter wise Important bit bank in Telugu medium”

Leave a Comment

Solve : *
2 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!