Paper 3 POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers
APPSC Paper 3 POLITY, Indian CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.
APPSC Group 1 Mains
2025 Question Paper
POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW & ETHICS
PAPER III
MAY 07 2025
Time: 3 hours
Maximum Marks: 150
Instructions:
i.The question paper is in three sections. The candidate has to write answers to 15 questions with 5 questions compulsorily from each section. Each question carries 10 marks.
ii.Enough space is available in the Answer Sheet for writing all answers. There is no provision for additional Answer Sheets.
iii.The candidate has to write all his/her answers in the medium/language chosen by him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the candidature would become invalid.
iv.Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid. Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her loss.
V.Though the question in English is taken as standard for valuation under normal circumstances, if necessary, a balanced view would be taken after comparing English and Telugu versions.
సూచనలు:
i.ప్రశ్న పత్రము మూడు విభాగాలను కలిగివుంటుంది. ప్రతి విభాగం నుండి తప్పనిసరిగా 5 ప్రశ్నలతో, అభ్యర్థి 15 ప్రశ్నలకు సమాధానాలు వ్రాయవలసివుంటుంది. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
ii.సమాధాన పత్రములో అన్ని జవాబులు వ్రాయుటకు తగిన స్థలము కలదు. అదనపు సమాధాన పత్రాలు ఇచ్చు సౌకర్యము లేదు.
iii.అభ్యర్థి తాను ఎన్నుకొన్న మాధ్యమము/ భాష లోనే అన్ని జవాబులను వ్రాయవలెను. ఒక జవాబు పత్రము మరియు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక ఒకే జవాబు పత్రములో కానీ, రెండు వేరు వేరు భాషలలో వ్రాసినట్లైతే, జవాబు పత్రము మదింపు చేయబడదు.
iv.జవాబు పత్రములో ఎక్కడైనా హైలైట్ చేసినా లేక ఏవైనా ప్రత్యేకమైన గుర్తులు పెట్టినా జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేరు వేరు రంగుల సిరాతో వ్రాసినా జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్యర్థులు కేవలము బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్ ఇంక్) మాత్రమే వాడవలెను. లేనిచో జవాబు పత్రము మదింపు చేయబడదు. జెల్ ఇంక్ / ఫౌంటెన్ ఇంక్ / స్కెచ్ పెన్ వాడుట నిషేదం. సమాధానాలు ఇతర సిరాలతో వ్రాసి, ఏ దశలోనైనా నీరు లేదా చెమట కారణంగా దెబ్బతింటే, అవి అతని/ఆమెకు నష్టమే అవుతాయి.
V.జవాబు పత్రము మదింపు చేయునపుడు ఆంగ్లము లోని ప్రశ్నను ప్రామాణికముగా తీసుకొన్నప్పటికీ, అవసరం అయితే ఆంగ్లములోని మరియు తెలుగు లోని ప్రశ్నలను పరిశీలించి, సంతులనాత్మక నిర్ణయము తీసుకొనబడుతుంది.
SECTION I
విభాగం I
1. (a) What are the emergency functions of the Union Government of India? Describe how they impact the legislative powers of Parliament and State Legislatures.
(అ) భారతదేశపు కేంద్ర ప్రభుత్వ అత్యవసర విధులు ఏమిటి? పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల శాసన అధికారాలను అవి ఏవిధంగా ప్రభావితం చేస్తాయో వివరించండి.
OR
(b) The Indian Constitution favours a federal type of government. Considering this, what duties does the Constitution place on State Governments to ensure the smooth functioning of the nation?
(ఆ) సమాఖ్య తరహా ప్రభుత్వానికి భారత రాజ్యాంగం అనుకూలంగా ఉంటోంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, దేశంలో వ్యవహారాలు సజావుగా సాగడం కోసం రాష్ట్ర ప్రభుత్వాల మీద రాజ్యాంగం విధించిన విధులు ఏవి?
2. (a) The procedure of enacting a law from a bill differs at the Union and State levels, primarily to safeguard the interests of the Union Government in state legislation. Elucidate this aspect.
(అ) రాష్ట్ర చట్టంలో కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు కాపాడేందుకు, బిల్లు నుండి చట్టం రూపొందించే విధానం అనేది కేంద్రం మరియు రాష్ట్రం స్థాయిలో భిన్నంగా ఉంటోంది. ఈ అంశాన్ని విశదీకరించండి.
OR
(b) Although States have their separate list for law-making, this authority is not beyond the overarching legislative powers of the Parliament. Examine.
(ఆ) చట్టాలు రూపొందించే విషయమై రాష్ట్రాలకు ప్రత్యేక జాబితా ఉన్నప్పటికీ, ఆ
అధికారం అనేది పార్లమెంట్కి ఉండే విస్తృత శాసన అధికారాల కంటే మించినదేమీ
కాదు. పరిశీలించండి.
3. (a) The Finance Commission is considered the backbone of fiscal federalism in India. Examine its role and significance in maintaining the financial balance between the Union and the States.
(అ) భారతదేశంలో ఆర్థిక సమాఖ్య వాదానికి ఆర్థిక సంఘం వెన్నెముకగా పరిగణించబడుతుంది. కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సమతుల్యతను కాపాడడంలో దాని పాత్ర మరియు ప్రాముఖ్యతను పరిశీలించండి.
OR
(b) Discuss the significance of the 73rd Constitutional Amendment Act in strengthening grassroots democracy in India.
(ఆ) భారతదేశంలో అట్టడుగు ప్రజాస్వామ్యం (గ్రాస్లెూట్ డెమోక్రసీ) ని బలోపేతం చేయడంలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రాముఖ్యతను గూర్చి చర్చించండి.
4. (a) What are the steps followed by the Indian Parliament in transforming a Bill into an Act?
(అ) బిల్లుని చట్టంగా మార్చడంలో భారత పార్లమెంట్ అనుసరించే దశలు ఏమిటి?
OR
(b) In what aspects is the Legislative Council (Vidhan Parishad) different from the Rajya Sabha, considering its role at the state level?
(ఆ) రాష్ట్ర స్థాయిలో, శాసన మండలి (విధాన పరిషత్) పాత్రను పరిగణనలోకి
తీసుకుంటే, రాజ్యసభ నుండి ఏ అంశాల్లో అది భిన్నంగా ఉంటుంది?
5. (a) The Constitution of India grants certain rights to citizens and also provides measures to safeguard them. What are the key constitutional arrangements to ensure the protection of these rights?
(అ) పౌరుల కోసం భారత రాజ్యాంగం కొన్ని హక్కులు ప్రసాదిస్తుంది మరియు వాటిని
కాపాడటానికి చర్యలు కూడా అందిస్తుంది. ఈ హక్కుల రక్షణను నిర్ధారించడానికి
ఎలాంటి కీలకమైన రాజ్యాంగ ఏర్పాట్లు ఉన్నాయి?
OR
(b) Discuss any two constitutional amendments that have significantly affected the powers or functioning of the Indian judiciary.
(ఆ) భారత న్యాయవ్యవస్థ అధికారాలను లేదా పనితీరును గణనీయంగా ప్రభావితం
చేసిన ఏవైనా రెండు రాజ్యాంగ సవరణలను గూర్చి చర్చించండి.
SECTION II
విభాగం II
6. (a) The administrative system of the Gupta dynasty was, in many ways, similar to that of the Mauryan Empire. Discuss the key similarities and differences between the two administrative structures.
(అ) గుప్త రాజవంశపు పరిపాలనా వ్యవస్థ అనేక విధాలుగా మౌర్య సామ్రాజ్యాన్ని పోలి ఉంటుంది. ఈ రెండు పరిపాలనా నిర్మాణాల మధ్య ఉన్న ముఖ్యమైన సారూప్యతలు మరియు తేడాలు గురించి చర్చించండి.
OR
(b) What features of British administration have influenced the Indian administrative system?
(ఆ) బ్రిటిష్ పరిపాలనలోని ఏ లక్షణాలు భారత పరిపాలనా వ్యవస్థను ప్రభావితం
చేశాయి?
7. (a) Education is a vital sector for boosting the development of any nation. Highlight the recent developments in the education policy of the Indian government.
(అ) దేశం ఏదైనప్పటికీ, దాని అభివృద్ధిలో విద్య ఒక కీలక రంగంగా ఉంటుంది. భారత ప్రభుత్వ విద్యా విధానంలో ఇటీవలి పరిణామాలను హైలైట్ చేయండి.
OR
(b) Although policies formulated by departments are prepared by experts, the results often fall short of expectations. What are the major issues responsible for this gap between policy formulation and implementation?
(ఆ) డిపార్టుమెంట్లు రూపొందించే విధానాలన్నీ నిపుణుల ద్వారా రూపొందినవే అయినప్పటికీ, వాటి ఫలితాలు మాత్రం తరచుగా అంచనాలకు తగ్గట్టుగా ఉండవు. విధాన రూపకల్పన మరియు అమలు మధ్య ఈవిధమైన అంతరానికి ఏ ప్రధాన సమస్యలు కారణమవుతున్నాయి?
8. (a) What do you understand by civil society in the Indian context? Discuss its key features and the limitations it faces in a democratic system.
(అ) భారతదేశం దృష్టికోణం నుండి చూసినప్పుడు, పౌర సమాజం అంటే మీకు ఏం అర్థమైంది? దాని ముఖ్య లక్షణాలు మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలో అది
ఎదుర్కొంటున్న పరిమితులు గురించి చర్చించండి.
OR
(b) In what ways can the role of NGOs be enhanced in promoting women’s empowerment and welfare in India? Discuss, with a focus on the key challenges they encounter.
(ఆ) భారతదేశంలో మహిళా సాధికారత మరియు సంక్షేమం ప్రోత్సహించడంలో NGOల పాత్రను ఏయే విధాలుగా మెరుగుపరచవచ్చు? అవి ఎదుర్కొంటున్న కీలక సవాళ్ల మీద దృష్టి సారించడం ద్వారా చర్చించండి.
9. (a) Under which Act was the National Commission for Women (NCW) established? Describe its main features and limitations.
(అ) జాతీయ మహిళా కమిషన్ (NCW) అనేది ఏ చట్టం క్రింద వ్యవస్థాపించబడింది?
దాని ప్రధాన లక్షణాలు మరియు పరిమితుల గురించి వివరించండి.
OR
(b) Which constitutional provisions empower the formation of quasi-judicial authorities in India? Explain with suitable examples.
(ఆ) భారతదేశంలో పాక్షిక-న్యాయ వ్యవస్థల (ఖ్వాసీ-జ్యూడీషియల్) ఏర్పాటుకి అధికారం ఇచ్చే రాజ్యాంగ నిబంధనలు ఏవి? తగిన ఉదాహరణలతో వివరించండి.
10. (a) Social audit helps to narrow gaps between vision and reality. Examine the statement and also discuss the impediments in the institutionalisation of social audit in India.
(అ) సామాజిక తనిఖీ అనేది దార్శనికత మరియు వాస్తవికత మధ్య అంతరాలు తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ ప్రకటన గురించి వివరించండి మరియు భారతదేశంలో సామాజిక తనిఖీ సంస్థాగతీకరణలోని అడ్డంకులు గురించి కూడా చర్చించండి.
OR
(b) Define good governance. How does the Right to Information (RTI) Act promote the principles of good governance in India?
(ఆ) సుపరిపాలనను నిర్వచించండి. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) భారతదేశంలో సుపరిపాలనా సూత్రాలను ఏ విధంగా ప్రోత్సహిస్తుంది?
SECTION III
విభాగం III
11. (a) Public servants often face situations where personal values conflict with public responsibilities. Examine how a strong ethical foundation can help resolve such dilemmas while maintaining accountability.
(అ) వ్యక్తిగత విలువలనేవి ప్రజా బాధ్యతలతో విభేదించడమనే పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో తరచుగా ఎదురవుతూ ఉంటుంది. జవాబుదారీతనం కొనసాగిస్తూనే, బలమైన నైతిక పునాది కలిగి ఉండడం అనేది అలాంటి సందిగ్ధతలను పరిష్కరించడంలో ఎలా సహాయపడగలదో పరిశీలించండి.
OR
(b) Whistleblowers are guardians of ethical accountability in governance. Discuss the ethical and institutional importance of whistleblower protection in ensuring integrity in public service.
(ఆ) పరిపాలనలో నైతిక జవాబుదారీతనానికి విజిల్ బ్లోయర్లు కాపలాదారులు. ప్రజా సేవలో సమగ్రత నిర్ధారణలో విజిల్ బ్లోయర్ సంరక్షణ యొక్క నైతిక మరియు సంస్థాగత ప్రాముఖ్యత గురించి చర్చించండి.
12. (a) What ethical values are essential to ensure peaceful coexistence in a diverse society? Illustrate your answer with suitable examples.
(అ) వైవిధ్యభరిత సమాజంలో శాంతియుత సహజీవనం నిర్ధారించడం కోసం ఏ నైతిక విలువలు అవసరం? తగిన ఉదాహరణలతో మీ సమాధానాన్ని క్రోడీకరించండి.
OR
(b) How does early value education in the family influence ethical decision- making in adulthood?
(ఆ) కుటుంబం నుండి లభించే విలువలకి సంబంధించిన ప్రాథమిక విద్య అనేది యుక్తవయస్సులో నైతిక నిర్ణయం తీసుకోవడాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది?
13. (a) Define attitude. How does attitude affect the behaviour of public servants?
(అ) వైఖరిని నిర్వచించండి. వైఖరి అనునది ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తనను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?
OR
(b) Explain the difference between cognitive, affective and behavioural components of attitude with suitable examples in the public service context.
(ఆ) ప్రజా సేవా సందర్భంలో తగిన ఉదాహరణలతో వైఖరి యొక్క సంజ్ఞానాత్మక, భావోద్వేగ మరియు ప్రవర్తనా అంశాల మధ్య వ్యత్యాసాన్ని వివరించండి.
14. (a) In what ways can the implementation of a code of ethics in public administration help in resolving conflicts of interest and promoting ethical decision-making?
(అ) ప్రజా పరిపాలనలో నైతిక నియమావళి అమలు చేయడమనేది ప్రయోజనాల సంఘర్షణలు పరిష్కరించడంలో మరియు నైతిక నిర్ణయం తీసుకోవడాన్ని ప్రోత్సహించడంలో ఏయే విధాలుగా సహాయపడుతుంది?
OR
(b) Discuss the significance of integrity, transparency and accountability in leadership. How can public leaders demonstrate these values in their decision- making process?
(ఆ) నాయకత్వంలో సమగ్రత, పారదర్శకత మరియు జవాబుదారీతనం ప్రాముఖ్యత గురించి చర్చించండి. ప్రజా నాయకులు వారి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో ఈ విలువలను ఏవిధంగా ప్రదర్శించవచ్చు?
15. (a) What do you understand by cyberstalking? What are the various other cyber offences recognised under Information Technology Act, 2000?
(అ) సైబర్ కింగ్ గురించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం – 2000 ప్రకారం గుర్తించబడిన వివిధ సైబర్ నేరాలు ఏమిటి?
OR
(b) What is GST? Discuss the regulatory framework of GST in India, including Constitutional provisions applicable to GST.
(ఆ) GST అంటే ఏమిటి? భారతదేశంలో GST నియంత్రణ ఫ్రేమ్వర్క్(చట్రం) గురించి, GSTకి వర్తించే రాజ్యాంగ నిబంధనలు గురించి చర్చించండి.
– 0 0 0 –
Download Other Papers:
- APPSC General Telugu (Qualifying Paper)
- APPSC General English (Qualifying Paper)
- APPSC Paper-I: GENERAL ESSAY
- APPSC Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
- APPSC Paper-III: POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS
- APPSC Paper-IV: ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
- APPSC Paper-V: SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES