Paper 4 ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers

Paper 4 ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH APPSC Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers

APPSC Paper 4 ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH Group 1 Mains 2025 Previous Year Question Paper With Answers is available here to understand the question pattern, difficulty level of the questions and useful to crack the future group 1 mains exam.



APPSC Group 1 Mains
2025 Question Paper
ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
PAPER IV
MAY 08 2025
Time: 3 hours
Maximum Marks: 150

Instructions:
I.The question paper consists of 15 questions. The candidate has to write answers to all questions. Each question carries 10 marks.
II.Enough space is available in the Answer Sheet for writing all answers. There is no provision for additional Answer Sheets.
III.The candidate has to write all his/her answers in the medium/language chosen by him/her only. If there is any deviation from paper to paper or part of the paper, the candidature would become invalid.
IV.Highlighting or putting special marks anywhere in the Answer booklet would make the Answer Sheet invalid. Writing in different inks would also make the paper invalid. Candidates must use ball pen only (Blue or Black ink). Otherwise, the paper will be treated as invalid. Use of gel ink / fountain ink / sketch pen is not allowed. If the answers written with other inks are damaged due to water or sweat at any stage, it will be his/her loss.
V.Though the question in English is taken as standard for valuation under normal circumstances, if necessary, a balanced view would be taken after comparing English and Telugu versions.

సూచనలు:
i. ప్రశ్నపత్రము 15 ప్రశ్నలు కలిగి ఉంటుంది. అభ్యర్థి అన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయవలెను. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
ii. సమాధాన పత్రములో అన్ని జవాబులు వ్రాయుటకు తగిన స్థలము కలదు. అదనపు సమాధాన పత్రాలు ఇచ్చు సౌకర్యము లేదు.
iii.అభ్యర్థి తాను ఎన్నుకొన్న మాధ్యమము/ భాష లోనే అన్ని జవాబులను వ్రాయవలెను. ఒక జవాబు పత్రము మరియు ఇంకొక జవాబు పత్రముల మధ్య కానీ లేక ఒకే జవాబు పత్రములో కానీ, రెండు వేరు వేరు భాషలలో వ్రాసినట్లైతే, జవాబు పత్రము మదింపు చేయబడదు.
iv.జవాబు పత్రములో ఎక్కడైనా హైలైట్ చేసినా లేక ఏవైనా ప్రత్యేకమైన గుర్తులు పెట్టినా జవాబు పత్రము మదింపు చేయబడదు. జవాబులు వేరు వేరు రంగుల సిరాతో వ్రాసినా జవాబు పత్రము మదింపు చేయబడదు. అభ్యర్థులు కేవలము బాల్ పాయింట్ పెన్ (బ్లూ/బ్లాక్ ఇంక్) మాత్రమే వాడవలెను. లేనిచో జవాబు పత్రము మదింపు చేయబడదు. జెల్ ఇంక్ / ఫౌంటెన్ ఇంక్ / స్కెచ్ పెన్ వాడుట నిషేదం. సమాధానాలు ఇతర సిరాలతో వ్రాసి, ఏ దశలోనైనా నీరు లేదా చెమట కారణంగా దెబ్బతింటే, అవి అతని/ఆమెకు నష్టమే అవుతాయి.
V.జవాబు పత్రము మదింపు చేయునపుడు ఆంగ్లము లోని ప్రశ్నను ప్రామాణికముగా తీసుకొన్నప్పటికీ, అవసరం అయితే ఆంగ్లములోని మరియు తెలుగు లోని ప్రశ్నలను పరిశీలించి, సంతులనాత్మక నిర్ణయము తీసుకొనబడుతుంది.


SECTION I
విభాగం I

1. (a) Analyse the factors contributing to India’s Current Account Deficit (CAD) and unfavourable Balance of Payments (BOP) and discuss their implications for the Indian economy.
(అ) భారతదేశపు కరెంట్ ఖాతా లోటు (CAD) మరియు అననుకూల చెల్లింపుల బ్యాలెన్స్ (BoP)కి కారణమవుతున్న అంశాల గురించి విశ్లేషించండి మరియు భారత ఆర్థిక వ్యవస్థ మీద వాటి ప్రభావాలు గురించి చర్చించండి.

OR

(b) Discuss how infrastructure bottlenecks hinder the growth of the Indian Manufacturing sector. What steps can be taken to address them?
(ఆ) భారత తయారీ రంగం వృద్ధికి మౌలిక సదుపాయాల అడ్డంకులు ఎలా ఆటంకం కలిగిస్తాయో చర్చించండి. వాటిని పరిష్కరించడానికి ఏ చర్యలు తీసుకోవచ్చు?

2. (a) Discuss the key instruments of Monetary Policy (RBI) and Fiscal Policy in India and evaluate their role in resource mobilisation and inflation management.
(అ) భారతదేశంలో ద్రవ్య విధానం (RBI) మరియు ఆర్థిక విధానంతో ముడిపడిన కీలక అంశాల గురించి చర్చించండి మరియు వనరుల సమీకరణ, ద్రవ్యోల్బణం నిర్వహణలో వాటి పాత్రను మూల్యాంకనం చెయ్యండి.

OR

(b) Differentiate between internal and external public debt. Explain their relative advantages and risks for a developing country like India.
(ఆ) అంతర్గత మరియు బాహ్య ప్రభుత్వ రుణాల మధ్య తేడాను గుర్తించండి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశానికి వాటి సాపేక్ష ప్రయోజనాలు మరియు నష్టాలను వివరించండి.

3. (a) Critically evaluate the role of education and healthcare in achieving and sustainable development in India. inclusive Highlight the current challenges and government interventions.
(అ) భారతదేశంలో సమ్మిళిత మరియు సుస్థిరాభివృద్ధిని సాధించడంలో విద్య మరియు ఆరోగ్య సంరక్షణ పాత్రను విమర్శనాత్మకంగా అంచనా వేయండి. ప్రస్తుత సవాళ్లు మరియు ప్రభుత్వ జోక్యాలను హైలైట్ చేయండి.

OR

(b) Explain the major sources of budgetary resources for Andhra Pradesh. What are the key challenges the state faces in mobilising adequate financial resources?
(ఆ) ఆంధ్రప్రదేశ్ బడ్జెటరీ రిసోర్సెస్ (వనరులు)కి మద్దతిస్తున్న ప్రధాన వనరులను వివరించండి. తగినంత ఆర్థిక వనరులను సమీకరించడంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లు ఏమిటి?

4. (a) What do you understand by Government Budget? Briefly explain the types of public expenditure and how these expenditures are classified in the government budget.
(అ) ప్రభుత్వ బడ్జెట్ అనేదాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ప్రభుత్వ వ్యయాల రకాలు మరియు ఈ వ్యయాలను ప్రభుత్వ బడ్జెట్లో ఏవిధంగా వర్గీకరిస్తారో క్లుప్తంగా వివరించండి.

OR

(b) Define the term ‘deficit’ in government finance. Explain the various types of deficits and their economic implications.
(ఆ) ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థలో ‘లోటు(డెఫిషిట్)’ అనే పదాన్ని నిర్వచించండి. వివిధ రకాల లోటులు మరియు వాటి ఆర్థిక ప్రభావాలను వివరించండి.

5. (a) Discuss the role of the State Finance Commission in Andhra Pradesh and analyse its significance in strengthening local finances and promoting fiscal decentralisation within the state.
(అ) ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఆర్థిక సంఘం పాత్ర గురించి చర్చించండి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మరియు రాష్ట్రంలో ఆర్థిక వికేంద్రీకరణను ప్రోత్సహించడంలో దాని ప్రాముఖ్యతను విశ్లేషించండి.

OR

(b) Discuss the key recommendations of the Fifteenth Finance Commission of
India. How do these recommendations influence government budgeting at the
centre and state levels?
(ఆ) భారత పదిహేనవ ఆర్థిక సంఘం ముఖ్య సిఫార్సులను చర్చించండి. ఈ సిఫార్సులు కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలలో ప్రభుత్వ బడ్జెటింగ్ను ఎలా ప్రభావితం చేస్తాయి?


SECTION II
విభాగం II

6. (a) What are the challenges faced by women in India? Throw some light on the recent programmes initiated by the government for women empowerment.
(అ) భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు ఏమిటి? మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కార్యక్రమాల గురించి పేర్కొనండి

OR

(b) Elaborate on the meaning of Inclusive Growth in the context of the Indian economy. Discuss the key strategies and instruments that can be employed to foster greater inclusion and ensure that the benefits of economic growth reach all sections of society.
(ఆ) భారత ఆర్థిక వ్యవస్థ సందర్భంలో సమ్మిళిత వృద్ధి అర్థాన్ని విశదీకరించండి. ఎక్కువ సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి మరియు ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు సమాజంలోని వర్గాలన్నింటికీ చేరేలా చూసుకోవడానికి ఉపయోగించగల కీలక వ్యూహాలు మరియు సాధనాలను చర్చించండి.

7. (a) Critically examine the major poverty alleviation and employment generation programmes in India. How effective have they been in addressing rural and urban poverty?
(అ) భారతదేశంలోని ప్రధాన పేదరిక నిర్మూలన మరియు ఉపాధి కల్పన కార్యక్రమాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి. గ్రామీణ మరియు పట్టణ పేదరికాన్ని పరిష్కరించడంలో అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయి?

OR

(b) Discuss the significance of Social Welfare Schemes in promoting inclusive growth in India. Analyse the key objectives and features of some major social welfare schemes and evaluate their effectiveness in reaching vulnerable populations and reducing inequalities.
(ఆ) భారతదేశంలో సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడంలో సామాజిక సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను చర్చించండి. కొన్ని ప్రధాన సామాజిక సంక్షేమ పథకాల కీలక లక్ష్యాలు మరియు లాక్షణికాలను విశ్లేషించండి మరియు బలహీన వర్గాల ప్రజలను చేరుకోవడంలో మరియు అసమానతలను తగ్గించడంలో వాటి ప్రభావాన్ని అంచనా వెయ్యండి.

8. (a) Examine the concept of ‘Financial Inclusion’ and its critical role in fostering inclusive growth in India. Discuss the key initiatives undertaken to promote financial inclusion and evaluate their impact on bringing the unbanked and underbanked populations into the formal financial system.
(అ) ‘ఆర్థిక సమ్మిళితం’ అనే భావనను మరియు భారతదేశంలో సమ్మిళిత వృద్ధిని పెంపొందించడంలో దాని కీలక పాత్రను పరిశీలించండి. ఆర్థిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడానికి చేపట్టబడిన కీలక కార్యక్రమాలను చర్చించండి మరియు అన్బ్యాంక్(బ్యాంకు సౌకర్యాలు లేని) మరియు అండరాబ్యాంక్ (తక్కువ బ్యాంకు సౌకర్యాలు ఉపయోగించే) జనాభాను అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడంలో వాటి ప్రభావాన్ని అంచనా వెయ్యండి.

OR

(b) Explain the concept of sustainable agriculture. What are its key objectives and common practices in India?
(ఆ) సుస్థిర వ్యవసాయం అనే భావనను వివరించండి. భారతదేశంలో దాని ముఖ్య లక్ష్యాలు మరియు సాధారణ పద్ధతులు ఏమిటి?

9. (a) Explain the role of the Agricultural Produce Market Committee (APMC) Act in Agricultural Price Policy in regulating the agricultural market in India. What are the issues that have been observed by policy makers regarding the functioning of the APMC Act?
(అ) భారతదేశంలో వ్యవసాయ మార్కెట్ను నియంత్రించడంలో వ్యవసాయ ధరల విధానం మీద వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) చట్టం పాత్ర గురించి వివరించండి. APMC చట్టం పనితీరుకి సంబంధించి విధాన నిర్ణేతలు గమనించిన సమస్యలను పేర్కొనండి?

OR

(b) Examine the significance of agriculture finance, production, and marketing in the context of India’s agricultural development. Discuss the challenges and opportunities associated with financing agricultural activities, improving production, and developing efficient marketing systems to support sustainable growth in the agricultural sector.
(ఆ) భారతదేశ వ్యవసాయాభివృద్ధి విషయంలో వ్యవసాయ ఫైనాన్స్, ఉత్పాదన మరియు మార్కెటింగ్ యొక్క ప్రాముఖ్యతను పరిశీలించండి. వ్యవసాయ కార్యకలాపాలకు ఫైనాన్సింగ్(ఆర్థిక సహాయం), ఉత్పాదనని మెరుగుపరచడం మరియు వ్యవసాయ రంగంలో సుస్థిర వృద్ధికి తోడ్పడటానికి సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యవస్థలను అభివృద్ధి చెయ్యడంతో సంబంధం ఉన్న సవాళ్లు మరియు అవకాశాలను చర్చించండి.

10. (a) What are the key drivers for the growth of the fisheries sector? What are the schemes undertaken by the fisheries department for the growth of this sector?
(అ) మత్స్య రంగం వృద్ధికి కీలక చోదకాలు ఏవి? ఈ రంగం వృద్ధి కోసం మత్స్య శాఖ చేపట్టిన పథకాలు ఏవి?

OR

(b) Discuss the role of agriculture in the economic development of Andhra Pradesh. How has agriculture contributed to the State Gross Domestic Product (SGDP) in recent years? Identify the key drivers influencing its performance.
(ఆ) ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయం పాత్రను చర్చించండి. ఇటీవలి సంవత్సరాలలో వ్యవసాయం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (SGDP)కి ఎలా దోహదపడింది? దాని పనితీరును ప్రభావితం చేసే ముఖ్య చోదకాలను గుర్తించండి.


SECTION III
విభాగం III

11. (a) Examine the role of the industrial sector in India’s economic development. How does industrialisation contribute to income generation, employment, and modernisation of the economy? Support your answer with relevant examples and policy references.
(అ) భారతదేశ ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక రంగం పాత్రను పరిశీలించండి. పారిశ్రామికీకరణ ఆదాయ ఉత్పత్తి, ఉపాధి మరియు ఆర్థిక వ్యవస్థ యొక్క ఆధునీకరణకు ఎలా దోహదపడుతుంది? సంబంధిత ఉదాహరణలు మరియు విధాన సూచనలతో మీ సమాధానాన్ని బలపరచండి.

OR

(b) Examine the role of the Startup India programme in promoting entrepreneurial development in India. What are the major features of the programme, and how has it contributed to the industrial and economic growth of the country?
(ఆ) భారతదేశంలో వ్యవస్థాపక అభివృద్ధిని ప్రోత్సహించడంలో స్టార్టప్ ఇండియా కార్యక్రమం పాత్రను పరిశీలించండి. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి మరియు అది దేశ పారిశ్రామిక మరియు ఆర్థిక వృద్ధికి ఎలా దోహదపడింది?

12. (a) Critically examine the industrial policy of the Andhra Pradesh government. What are the major initiatives, support measures and bottlenecks to industrial development in the state?
(అ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పారిశ్రామిక విధానాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రధాన కార్యక్రమాలు, సహాయక చర్యలు మరియు అడ్డంకులు ఏమిటి?

OR

(b) Discuss the role of the industrial sector in the economic development of India. Discuss the role of the Department of Industrial Policy & Promotion (DIPP)
(ఆ) భారతదేశ ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక రంగం పాత్రను చర్చించండి.
పారిశ్రామిక విధానం & ప్రమోషన్ విభాగం (DIPP) పాత్రను చర్చించండి.

13. (a) Discuss the current state of transport infrastructure in India and its contribution to economic development. Highlight key challenges and suggest policy measures for improving its efficiency and reach.
(అ) భారతదేశంలో రవాణా మౌలిక సదుపాయాల ప్రస్తుత స్థితి మరియు ఆర్థికాభివృద్ధికి దాని సహకారాన్ని చర్చించండి. కీలక సవాళ్లను ప్రాముఖ్యపరచి, దాని సామర్థ్యం మరియు పరిధిని మెరుగుపరచడానికి విధాన చర్యలను సూచించండి.

OR

(b) Discuss the significance of solar energy in India’s renewable energy strategy. Highlight the major initiatives, achievements and challenges in the promotion of solar power.
(ఆ) భారతదేశ పునరుత్పాదక శక్తి(రెన్యూయబుల్ ఎనర్జీ) వ్యూహంలో సౌరశక్తి ప్రాముఖ్యతను చర్చించండి. సౌరశక్తిని ప్రోత్సహించడంలో ప్రధాన కార్యక్రమాలు, విజయాలు మరియు సవాళ్లను హైలైట్ చేయండి.

14. (a) Critically evaluate the role of the Smart Cities Mission in transforming urban infrastructure in India. Mention its objectives, implementation progress, key achievements and the major challenges faced.
(అ) భారతదేశంలో పట్టణ మౌలిక సదుపాయాల రూపురేఖలు మార్చడంలో స్మార్ట్ సిటీస్ మిషన్ పాత్రను విమర్శనాత్మకంగా అంచనా వేయండి. దాని లక్ష్యాలు, అమలు పురోగతి, కీలక విజయాలు మరియు ఎదుర్కొన్న ప్రధాన సవాళ్లను పేర్కొనండి.

OR

(b) Critically explain the development of Transport, Energy and ICT infrastructure in Andhra Pradesh. How do these sectors contribute to the state’s economic growth and connectivity?
(ఆ) ఆంధ్రప్రదేశ్లో రవాణా, ఇంధనం (ఎనర్జీ) మరియు ICT మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి విమర్శనాత్మకంగా వివరించండి. ఈ రంగాలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి మరియు కనెక్టివిటీకి ఎలా దోహదపడుతాయి?

15. (a) Discuss the significance of the recommendations of the latest Finance Commission for the fiscal relations between the Union Government and the States in India, with specific reference to resource allocation and revenue sharing.
(అ) భారతదేశంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాల కోసం తాజా ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల ప్రాముఖ్యత గురించి చర్చించండి. వనరుల కేటాయింపు మరియు ఆదాయ భాగస్వామ్యం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించండి.

OR

(b) What are the flaws in the existing Public Private Partnership (PPP) model of infrastructure development? What are the key points to focus on while restructuring the PPP model?
(ఆ) ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (PPP) మౌలిక
సదుపాయాల అభివృద్ధి నమూనాలోని లోపాలు ఏమిటి? PPP నమూనాను
పునర్నిర్మించేటప్పుడు దృష్టిసారించవలసిన ముఖ్య అంశాలు ఏమిటి?

– 0 0 0 –

Download Other Papers:

  1. APPSC General Telugu (Qualifying Paper)
  2. APPSC General English (Qualifying Paper)
  3. APPSC Paper-I: GENERAL ESSAY
  4. APPSC Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
  5. APPSC Paper-III: POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS
  6. APPSC Paper-IV: ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
  7. APPSC Paper-V: SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
30 ⁄ 15 =