GENERAL TELUGU (Qualifying Test) APPSC Group 1 Mains 2025 Question Paper With Answers

GENERAL TELUGU (Qualifying Test) APPSC Group 1 Mains 2025 Question Paper With Answers

The General TELUGU (Qualifying Test) for APPSC Group 1 Mains 2025 is designed to assess candidates’ basic proficiency in TELUGU. The test is of Class 10 standard and focuses on grammar, comprehension, and composition. It includes topics such as spotting errors, fill-in-the-blanks, sentence transformation, précis writing, and letter writing. While the exam is qualifying in nature, candidates need to pass it to proceed to the next stages of the examination. Previous years’ papers often include questions like re-arranging jumbled sentences, filling in missing prepositions, and summarizing passages.



APPSC Group 1 Mains
2025 Question Paper
TELUGU
Time: 3 hours
Maximum Marks: 150

Instructions: Attempt all questions.
సూచనలు: అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాయవలెను.

1. ఈ క్రింది వాటిలో ఏవైనా రెండు పద్యాలకు భావార్థం రాయండి. ఒక్కొక్క దానికి వంద పదాలకు తక్కువకాకుండా రాయండి : (Marks: 20)
(i) కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను మనసు కుందుజెందు
కోపమడచెనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ!

(ii) ఒరు లేయవి యొనరించిన
నరవర! యప్రియము దనమనంబునకగు దా
నొరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మపథముల కెల్లన్.

(iii) చేతులకు దొడవు దానము
భూతలనాథులకు దొడవు బొంకమి ధరలో
నీతియె తొడవెవ్వారికి
నాతికి మానంబు తొడవు నయముగ సుమతీ!

2. ఈ క్రింది గద్యభాగాన్ని చదివి, దాని సారాంశాన్ని మూడవ వంతు పరిమాణంలో క్లుప్తీకరించి వ్రాయండి. (Marks: 10)

హనుమంతుడు మహాబలవంతుడు. అతడు సముసముద్రాన్ని దాటేముందు శరీరాన్ని పెంచి మహేంద్రగిరిపై అడుగులు వేశాడు. అప్పుడు పిడుగులు పడ్డట్లు రాళ్ళు పగిలిపోయాయి. హనుమంతుడు తోకను త్రిప్పినప్పుడు వచ్చిన గాలి వేగానికి చెట్లు కూలిపోయాయి. అతడు చేతితో చరిస్తే భయపడి క్రూర జంతువులు పారిపోయాయి. అతడు చేసిన సింహనాదానికి గుహలు ప్రతిధ్వనించాయి. కొండలు కంపించాయి. కొండలపై సెలయేళ్ళ కెరటాలు ఎగసిపడి ఆకాశాన్ని తాకాయి. హనుమంతుడు పెరిగి మహేంద గిరిపై నిలిచాడు.

హనుమంతుడు సముద్రం వైపు చూసి, తన రెండు చెవులూ రిక్కించి, వంగి, చేతులను నడుముకు ఆనించి, తోకను ఆకాశం మీదికి పెంచి, పాదాలు దగ్గరగా పెట్టి, గాలి గట్టిగా పీల్చి, తాను నిలబడ్డ కొండను అణగద్రొక్కి పైకి ఎగిరాడు.

హనుమంతుడు ఎగురుతూ ఉంటే, పర్వతము ఎగిరినట్లు అనిపించింది. హనుమంతుడు విల్లు నుండి విడిచిన బాణంలా పెద్ద ధ్వనితో లంక వైపు దూసుకుపోయాడు. హనుమంతుడు తోకతో ఎగరడం చూసిన దేవతలు, సూర్యుడు మహా వేగంగా కాడి ఉన్న తన రథాన్ని అటువైపు తోలుకు వస్తున్నాడేమో అనుకొన్నారు. హనుమంతుని పిక్కల నుండి వచ్చిన గాలి వేగానికి, సముద్రం లోతుగా చీలింది. ఆ గాలి పాతాళంలో ఉన్న పాములకు, ఆహారం వచ్చిందేమో అనిపించింది. హనుమంతుడి పిక్కల బలంతో వీచిన గాలి వేగానికి సముద్రం చీలినట్లు కాగా, రాముని క్రోధరసం లంకకు చేరడానికి తవ్విన కాలువలా, రాబోయే కాలంలో కట్టే సేతువుకు పునాదిలా, ఆదిశేషుడు తలుపులు తెరిచిన బలిమందిరం యొక్క వాకిలిలా కనిపించింది. హనుమ, త్రికూటాద్రిపై దిగాడు.

3. ఈ క్రింది గద్య భాగాన్ని చదివి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. (Marks: 10)
ఆధునిక యుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు 16.4.1848 లో జన్మించారు. వీరి జన్మస్థలం రాజమహేంద్రవరం. పున్నమ్మ, సుబ్బరాయుడు కందుకూరి తల్లిదండ్రులు. వీరు చేపట్టిన సామాజిక సంస్కరణ కార్య క్రమాలలో అధిక భాగం స్త్రీలకు సంబంధించినవే. కన్యాశుల్కాన్నీ, బాల్యవివాహాలను రద్దు చేయడం; వితంతువులకు పునర్వివాహం జరిపించడం వంటి కార్యక్రమాల్ని కందుకూరి భుజానికెత్తుకున్నారు. అంతేకాక స్త్రీ విద్య కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈనాడు ఇంతమంది ఆడపిల్లలు విద్య నేర్చుకుంటున్నారు అంటే దాని వెనుక కందుకూరి ఆకాంక్ష మెండుగా ఉందన్న వాస్తవాన్ని మరిచిపోకూడదు. వెల కట్టలేని వీరి మూర్తిమత్వాన్ని ఈనాటి విద్యార్థులకు పరిచయం చేయడం; వారిలో వీరేశలింగం గారి సంస్కరణ స్పూర్తిని కల్గింప చేయడం, వారికి సామాజిక బాధ్యత గురించి తెలియచేయడం ఈ పాఠ్యభాగం ప్రధాన ఉద్దేశం.

సంఘ సంస్కర్త అని ఈయన మారుపేరు. కందుకూరివారి సంస్కరణలలో ముఖ్యమైనది, శాశ్వత చరిత్ర గలది స్త్రీ జనోద్ధరణ. ఆయన కార్యాచరణకు ఒక తాత్విక ప్రాతిపదిక వుంది. దానికి ఒక కార్యక్రమం కూడా వుంది. తను విశ్వసించినదానిలో నమ్మకం వున్న వ్యక్తి. ఆయన వ్యక్తిత్వమూ, సంకల్ప బలమూ కల మహామనిషి. కనుక ఆనాడు అతి నిషేధమైన వితంతు వివాహాన్ని, స్త్రీ విద్యను ప్రోద్బలపరిచాడు. కన్యాశుల్కాన్ని వ్యతిరేకించాడు. శాస్త్రాల ఆధారాలతో బాల్య వివాహాలను తిరస్కరించాడు. స్త్రీ విద్యను బలపరిచాడు. “స్త్రీలు విద్యకు తగరు” అని వ్యతిరేకులు అన్నప్పుడు “పురుషులు విద్యకు తగరు” అని ఎగతాళి చేస్తూ ‘వివేకవర్ధని’లో వ్రాశాడు. 1874లో ధవళేశ్వరంలోను, 1881లో రాజమండ్రిలోను బాలికా పాఠశాలలను స్థాపించాడు. ముందుగా తన భార్యకు విద్యనేర్పి ఆమెనొక ఉపాధ్యాయినిగా తయారుచేశాడంటే త్రికరణశుద్ధి గల వ్యక్తి కనుకనే తాను ఆచరించి ప్రబోధ చెయ్యటంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు.

1. కందుకూరి వీరేశలింగం అంటే దేనికి మారుపేరు?
2. కందుకూరి సంస్కరణలలో ముఖ్యమైనది.
3. రాజమండ్రిలో బాలికల పాఠశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు?
4. కందుకూరి ఏ సంవత్సరంలో జన్మించారు.
5. కందుకూరి రద్దుచేసినది ఏమిటి?

4. క్రీడల్లో జాతీయ స్థాయి అవార్డు పొందిన మీ స్నేహితుడిని అభినందిస్తూ 100 పదాలకు తక్కువ కాకుండా లేఖ రాయండి ? (Marks: 10)

5. మీ పట్టణంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయ సేవలను వినియోగించుకోమని ప్రజలకు వార్తా పత్రిక ప్రకటన ద్వారా తెలియచేయండి : (Marks: 10)

6. ‘బాలకార్మిక వ్యవస్థ పూర్తి నిర్మూలన’ సాధ్యాసాధ్యాలను వివరించండి? (Marks: 10)

7. మీ కాలేజిలో ఆటస్థల విస్తరణ కోసం స్థలం కేటాయించమని కోరుతూ విద్యాశాఖ అధికారికి 150 పదాలకు తక్కువ కాకుండా నివేదిక రాయండి: (Marks: 10)

8. ఈ క్రింది అంశాన్ని నూట యాభై పదాలలో తెలుగులోకి అనువాదం చెయ్యండి: (Marks: 10)
Patients at risk due to advice against conventional medicine such as vaccinations, anti- malarial drugs and antibiotics. Depending on the dilution, homeopathic remedies may not contain any pharmacologically active molecules and for such remedies to have pharmacological effect would violate fundamental principles of science.

Modern homeopaths have proposed that water has a memory that allows homeopathic preparations to work without any of the original substance; however, there are no verified observations nor scientifically plausible physical mechanisms for such a phenomenon. The lack of convincing scientific evidence supporting homeopathy’s efficacy and its use of remedies lacking active ingredients have caused homeopathy to be described as pseudoscience.

9. మీరు ఒక జిల్లా కలెక్టరుగా, వేసవికాలంలో వచ్చే ప్రమాదభరితమైన వేడిగాలుల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని తెలియచేస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి 100 పదాలకు తక్కువ కాకుండా పత్రికా ప్రకటన రాయండి. (Marks: 10)

10. మద్యం మత్తులో పక్కదారి పడుతున్న యువత గురించి తోటి విద్యార్థుల సంభాషణను 150 పదాలకు తక్కువ కాకుండా రాయండి: (Marks: 10)

11. మీ అధ్యాపకుడు బదిలీయై వెళ్ళే సందర్భాన్ని పురస్కరించుకొని 100 పదాలకు తక్కువ కాకుండా ఉపన్యాసం ఇవ్వండి: (Marks: 10)

12. క్రింది అంశాలలో ఒకదానికి 200 పదాలకు తక్కువ కాకుండా వ్యాసం రాయండి. (Marks: 10)
1. మాతృభాషలో విద్యాబోధన
2. పెహల్గాంలో ఉగ్రదాడి
3 ఆన్ లైన్లో విద్యా విధానం
4. యువతపై సామాజిక మాధ్యమాల ప్రభావం

13. క్రింది వ్యాకరణాంశాలను వివరించండి:
(i) ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానం రాయండి? (Marks: 2)
పుంప్వాదేశ సంధిలో ఏ ప్రథమా విభక్తి ప్రత్యయం వచ్చి చేరుతుంది?
(ii)ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానం రాయండి? (Marks: 2)
చంపక మాలలో యతి ఎన్నవ అక్షరం?
(iii)”ముజ్జగమ్ములు” ఏ సమాసం? (Marks: 2)
(iv)ఈ క్రింది ప్రశ్నకు సరియైన సమాధానం రాయండి? (Marks: 2)
ఉన్న విషయాన్ని ఎక్కువ చేసి చెప్పడాన్ని ఏమంటారు? (Marks: 2)
(v)జాతీయాలు దేనికి సంబంధించినవి? (Marks: 2)
(vi)’ఖగము’ అన్న పదానికి పర్యాయపదం రాయండి? (Marks: 2)
(vii)’అద్భుతము’ అన్న పదానికి వికృతి రాయండి? (Marks: 2)
(viii)ఈ క్రింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి: (Marks: 3)
1. మంచి
2. సంతోషం
3.ప్రకృతి
(ix)గీత గీసిన పదానికి అర్థం వ్రాయండి. (Marks: 3)
1. కనుగవ ను కాపాడుకోవాలి.
2. కొల్వు లో అనుచితంగా ప్రవర్తించకూడదు.
3. కత్తి కుత్తుక లో దిగినా మహాత్ములు అసత్యం పలకరు.

– 0 0 0 –

Download Other Papers:

  1. APPSC General Telugu (Qualifying Paper)
  2. APPSC General English (Qualifying Paper)
  3. APPSC Paper-I: GENERAL ESSAY
  4. APPSC Paper-II: History, Culture, and Geography of India and Andhra Pradesh
  5. APPSC Paper-III: POLITY, CONSTITUTION, GOVERNANCE, LAW And ETHICS
  6. APPSC Paper-IV: ECONOMY AND DEVELOPMENT OF INDIA AND ANDHRA PRADESH
  7. APPSC Paper-V: SCIENCE, TECHNOLOGY & ENVIRONMENTAL ISSUES
Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
21 + 23 =