TSPSC Group 4 Paper 1 Previous Paper 2018 GENERAL KNOWLEDGE And GENERAL STUDIES Questions With Answers and Explanation

111) కింది వాటిని జతపరచండి :

జాబితా-1 జాబితా-2
ఎ. 7వ షెడ్యూల్ 1. భూ సంస్కరణలు మరియు రిజర్వేషన్స్
బి. 8వ షెడ్యూల్ 2. ఫిరాయింపు నిరోధక చట్టం
సి. 9వ షెడ్యూల్ 3. అధికార విభజన
డి. 10వ షెడ్యూల్ 4. పంచాయతీరాజ్ వ్యవస్థ
5. అధికార భాషలు

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-5, బి-3, సి-4, డి-2
B) ఎ-3, బి-5, సి-1, డి-2
C) ఎ-3, బి-5, సి-1, డి-4
D) ఎ-5, బి-3, సి-1, డి-2

View Answer
B) ఎ-3, బి-5, సి-1, డి-2

112) కింది వాటిని జతపరచండి :

సంస్థ అధ్యక్షులు
ఎ. భావ సమైక్యత ప్రజా సంఘటన 1. అచ్యుత రెడ్డి
బి. తెలంగాణ ప్రజా సమితి 2. శ్రీమతి ఈశ్వరీబాయి
సి. రిపబ్లికన్ పార్టీ 3. టి.మదన్ మోహన్
డి. తెలంగాణ ఉద్యమ సమన్వయ సంఘం 4. రామానంద తీర్థ

సరియైన జతలను/జవాబును ఎంపిక చేయండి :

A) ఎ-1, బి-3, సి-2, డి-4
B) ఎ-4, బి-2, సి-1, డి-3
C) ఎ-1, బి-2, సి-3, డి-4
D) ఎ-4, బి-3, సి-2, డి-1

View Answer
D) ఎ-4, బి-3, సి-2, డి-1

113) భూ పంపిణీ, భూ శాసనం అమలును సమీక్షించడానికి 2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ కమిటీని నియమించింది ?

A) సిహెచ్.హనుమంతరావు కమిటీ
B) జయతి ఘోష్ కమిటీ
C) రోశయ్య కమిటీ
D) కోనేరు రంగారావు కమిటీ

View Answer
D) కోనేరు రంగారావు కమిటీ

114) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. 18వ ఆసియా క్రీడల (2018)లో రూపిందర్‌పాల్ సింగ్ భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్
బి. ఈ క్రీడలు 18 ఆగస్టు 2018 నుండి జకర్తా మరియు పాలెంబింగ్ అనే నగరాలలో మొదలయ్యాయి
సి. 18వ ఆసియా క్రీడల ముగింపు ఉత్సవం సెప్టెంబర్ 2, 2018 నాడు జరిగింది
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) బి మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) ఎ మరియు సి మాత్రమే

View Answer
A) బి మరియు సి మాత్రమే

115) కింది వ్యాఖ్యలను పరిశీలించండి :
ఎ. అంతర్జాతీయ ద్రవ్య నిధి తన జులై 2018 ప్రపంచ ఆర్థిక దృక్పథం (వరల్డ్ ఎకనమిక్ ఔట్లుక్)లో భారతదేశ వృద్ధి రేటు 2018లో 7.3%గా, 2019లో 7.5% గా ఉంటుందని అంచనా వేసింది.
బి. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ (OECD) వారి అభివృద్ధి కేంద్రం భారతదేశ స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 2018-19లో 7.4%గా, 2019-20లో 7.5%గా ఉంటుందని అంచనా వేసింది
సి. జనవరి 2018లో భారత ప్రభుత్వం విడుదల చేసిన ‘ఆర్థిక సర్వే’ ప్రకారం 2018-19 సంవత్సరానికి భారతదేశ వృద్ధి అంచనాలు 7.0-7.5 శాతం పరిధిలో ఉంటాయి
సరియైన జవాబును ఎంపిక చేయండి :

A) ఎ మరియు సి మాత్రమే
B) ఎ, బి మరియు సి
C) ఎ మరియు బి మాత్రమే
D) బి మరియు సి మాత్రమే

View Answer
B) ఎ, బి మరియు సి

Spread the love

Leave a Comment

MCQBits provides free online MCQ practice tests for competitive exams, school exams, and entrance tests in India. Practice chapter-wise multiple choice questions, previous year papers, and mock tests with answers to improve your exam performance.
Prepare for TSPSC, APPSC, TS Polycet, CBSE Class 10, SSC,UPSC, RRB and other government exams with regularly updated quizzes and important questions.
About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!